భారతదేశం, జూన్ 20 -- భారత టెస్టు క్రికెట్లో కొత్త శకం ప్రారంభమవుతోంది. దశాబ్దానికి పైగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టీమిండియా టెస్టు టీమ్ కు ప్రధాన స్తంభాల్లాగా ఉన్నారు. కానీ వీళ్లు ఇద్దరు లేకుండా టీమిండియా చాలా కాలం తర్వాత టెస్టు ఆడబోతుంది. నేడే (జూన్ 20) ఇంగ్లాండ్ తో ఫస్ట్ టెస్టు. కెప్టెన్ గా శుభ్‌మ‌న్ గిల్‌ ఎరా ప్రారంభమవుతుంది. అలాగే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27 సైకిల్ లో ఇదే ఫస్ట్ సిరీస్. దీంతో ఇండియా, ఇంగ్లాండ్ సిరీస్ స్పెషల్ గా మారింది.

లీడ్స్ లోని హెడింగ్లీలో జరిగే తొలి టెస్టుతో టీమిండియా ఐదు టెస్టుల ఇంగ్లాండ్ పర్యటన ప్రారంభం కానుంది. భారత క్రికెట్లో కొత్త శకానికి ఇది నాంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్ ఆటగాళ్ల రిటైర్మెంట్ తర్వాత తొలిసారి టెస్టు జట్టుకు సారథ్యం వహిస్తున్న శుభ్‌మ‌న్ గిల్‌ పై అంద...