భారతదేశం, ఆగస్టు 6 -- అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై 'సుంకాల' దాడి చేశారు. రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్నందుకు భారత్‌కు శిక్షగా 25శాతం అదనపు సుంకం విధిస్తున్నట్లు బుధవారం రాత్రి ప్రకటించారు. తద్వారా భారత్ నుంచి అమెరికాలోకి దిగుమతయ్యే వస్తువులపై ఇప్పుడు మొత్తం సుంకం 50 శాతానికి చేరుకుంది! ఈ కొత్త సుంకం మరో 21 రోజుల్లో అమల్లోకి వస్తుంది. రష్యా నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చమురు కొనుగోలు చేస్తున్న ఇతర దేశాలపైనా ఇలాంటి చర్యలే తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించారు.

రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయడానికి భారత్​కు ఆగస్టు 9 వరకు గడువు ఇచ్చిన ట్రంప్, అలా చేయకపోతే 100 శాతం సుంకం విధిస్తానని గతంలో బెదిరించిన విషయం తెలిసిందే. అయితే, ఇండియాపై ప్రస్తుతం ఉన్న 50 శాతం టారీఫ్​.. చైనాపై ఉన్న సుంకం కన్నా 20 శాతం, పాక...