భారతదేశం, అక్టోబర్ 11 -- ఇండియా ఫస్ట్ ఫీమేల్ సూపర్ హీరో లోకా చాప్టర్ 1: చంద్ర ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మలయాళ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై లేటెస్ట్ బజ్ నెలకొంది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడొస్తుందో చూద్దాం.

కల్యాణి ప్రియదర్శన్ నటించిన మలయాళ చిత్రం 'లోకా చాప్టర్ 1: చంద్ర' ఓటీటీ రిలీజ్ పై బజ్ నెలకొంది. ఆగస్టు 28న థియేటర్లలో విడుదలై మంచి బజ్ క్రియేట్ చేసింది ఈ మూవీ. ఈ సినిమాను దుల్కర్ సల్మాన్ తన వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. 123తెలుగు నివేదిక ప్రకారం 'లోకా చాప్టర్ 1: చంద్ర' డిజిటల్ హక్కులను జియోహాట్‌స్టార్‌ దక్కించుకుంది. ఇది ఓటీటీ అరంగేట్రం చే...