భారతదేశం, ఫిబ్రవరి 16 -- అదే ఆధిపత్యం.. అదే విజయం. టీ20 ప్రపంచకప్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను టీమిండియా మరోసారి చిత్తుచేసింది. ఆదివారం (ఫిబ్రవరి 15) రాత్రి కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో ముగిసిన మ్యాచ్ లో ఇండియా 61 పరుగుల తేడాతో పాక్ పై ఘన విజయం సాధించింది. ఈ విక్టరీ ఇండియా కోసం అని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ డిక్లేర్ చేశాడు.

పాకిస్థాన్ పై విక్టరీ తర్వాత సూర్యకుమార్ యాదవ్ మాట్లాడాడు. 'ఇది ఇండియా కోసం' అని అతను డిక్లేర్ చేశాడు. ఈ మ్యాచ్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టిన ఇషాన్ కిషన్ పై సూర్య ప్రశంసలు కురిపించాడు.

''ఇది ఇండియా కోసం. మేం అనుకున్నట్లుగానే ఆడాం. ఈ వికెట్ పై ముందు బ్యాటింగ్ చేయడం మంచిదని టాస్ సమయంలో కూడా చెప్పా. ఇషాన్ ఆడిన తీరు అద్భుతం. ఇషాన్ కొత్తగా ఆలోచించాడు. పవర్ ప్లేలో ఎవరో ఒకరు చెలరేగాలి. ఇషాన్ ఆ బాధ్య...