భారతదేశం, డిసెంబర్ 11 -- ఇటీవల 'ప్రాడా' అనే ఇటాలియన్ ఫ్యాషన్ కంపెనీ వివాదంలోకి చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఓపెన్-టో లెదర్ శాండల్స్‌ను ఆవిష్కరించగా. ఈ శాండల్స్ సంప్రదాయ భారతీయ కొల్హాపుర్ చెప్పులను పోలి ఉండటంతో ఈ వివాదం మొదలైంది.

ఈ కంపెనీ తయారు చేసిన శాండల్స్ లో కొల్హాపుర్ చెప్పులకు ఉండే ప్రత్యేకమైన అల్లికతో కూడిన లెదర్ పట్టీలు, ఓపెన్-టో స్టైల్ స్పష్టంగా కనిపించాయి. వీటిని ప్రాడా కంపెనీ 'లెదర్ శాండల్స్' అని మాత్రమే చెప్పింది. భారతీయ మూలాలను లేదా కొల్హాపుర్‌ సంప్రదాయ హస్తకళ అని కూడా అంగీకరించలేదు.

ప్రాడా వ్యవహారించిన తీరుపై భారత్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, హస్త కళాకారుల సంఘాలు, రాజకీయ నాయకులు దుమ్మెత్తిపోశారు.వారసత్వ కళల అపహరణకు పాల్పడిందంటూ నెటిజన్లు కూడా సీరియస్ పోస్టులు చేశారు.

ఈ వివాదం తర్వాత. ప్రాడా కంపెనీ స్పందించింది. తమ డ...