భారతదేశం, జూలై 18 -- భారతదేశంలో తన గేమ్-ఛేంజింగ్ 'హైప్' ఫీచర్‌ను యూట్యూబ్ తాజాగా లాంచ్​ చేసింది. చిన్న క్రియేటర్లకు మరింత గుర్తింపునిచ్చి, వారు ఎదగడానికి ఈ ఫీచర్ ఒక చక్కటి అవకాశాన్ని కల్పిస్తుందని సంస్థ చెబుతోంది. వివిధ భాషలు, ప్రాంతాలు, జీవనశైలి నుంచి క్రియేటర్లు కొత్త ప్రేక్షకులను చేరుకోవడానికి ఈ హైప్​ ప్రోత్సహిస్తుందని వివరించింది. హైప్ ఫీచర్ గురించి ఒక క్రియేటర్‌గా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ చూసేయండి..

ఈ యూట్యూబ్​ హైప్ ఫీచర్​ని 500 నుంచి 500,000 మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్న క్రియేటర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. ఇది వీక్షకులకు.. కొత్తగా ఎదుగుతున్న క్రియేటర్ వీడియోను 'హైప్' చేయడానికి ఒక కొత్త ఆప్షన్​ని ఇస్తుంది. అర్హత ఉన్న ఛానెల్ వీడియో కింద ఒక కొత్త 'హైప్ బటన్' కనిపిస్తుంది. ఈ బటన్‌ను నొక్కడం వల్ల వీడియోకు పాయింట్‌లు...