భారతదేశం, డిసెంబర్ 3 -- ప్రపంచవ్యాప్తంగా సినిమా సమాచారాన్ని అందించే ప్రముఖ వేదిక IMDb.. 2025 సంవత్సరానికి గాను మోస్ట్ పాపులర్ ఇండియన్ డైరెక్టర్స్ జాబితాను ప్రకటించింది. నెలకు 250 మిలియన్ల కంటే ఎక్కువ మంది వ్యూయర్స్ పేజ్ వ్యూస్ ఆధారంగా ఈ ర్యాంకింగ్‌లను రూపొందించారు. ఇందులో తొలి స్థానంలో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ లలో ఒకటిగా నిలిచిన సయ్యారాను డైరెక్ట్ చేసిన మోహిత్ సూరి ఉన్నాడు. ఒక్క తెలుగు డైరెక్టర్ కూడా టాప్ 10లో లేడు.

ఈ జాబితాలో మోహిత్ సూరి మొదటి స్థానంలో ఉన్నప్పటికీ.. అందరి దృష్టి మాత్రం ఆర్యన్ ఖాన్ పైనే ఉంది. కేవలం 28 ఏళ్ల వయసులో, తన మొదటి ప్రాజెక్ట్‌తోనే ఆర్యన్ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ టాప్-10 జాబితాలో ఉన్న అతి పిన్న వయస్కుడు మాత్రమే కాదు.. కేవలం వెబ్ సిరీస్ ద్వారా ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక దర్శకుడు కూడా ఆర్యనే కావ...