Hyderabad, ఆగస్టు 28 -- సినీ దర్శకురాలు, కొరియోగ్రాఫర్, యూట్యూబ్ స్టార్ ఫరా ఖాన్ తన లేటెస్ట్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. అది ఒక డిఫరెంట్, సరదా టాలెంట్ షో. దాని పేరు ఆంటీ కిస్కో బోలా (Aunty Kiso Bola). ఈ షో ఏజ్ తో సంబంధం లేకుండా టాలెంట్ ఉన్న మహిళల కోసం ప్రత్యేకంగా చేసింది. ఇది ఆమె యూట్యూబ్ ఛానెల్‌లో ప్రీమియర్ అవుతుంది. ఇండియాలోని నెంబర్ 1 ఆంటీలకు ఇది ఒక మంచి ప్లాట్‌ఫామ్ అవుతుంది.

బాలీవుడ్ డైరెక్టర్ ఫరా ఖాన్ వెరైటీ టైటిల్, కాన్సెప్ట్ తో వస్తోంది. ఈ షో పేరు ఆంటీ కిస్కో బోలా. ఈ షోను ఇన్‌స్టాగ్రామ్‌లో అనౌన్స్ చేస్తూ.. ఫరా ఒక టీజర్ క్లిప్ ను షేర్ చేశారు. ఇందులో ఆమె తమ్ముడు, ఫిల్మ్ మేకర్ సాజిద్ ఖాన్, గోవింద భార్య సునీతా అహుజా మొదటి జడ్జిలుగా కనిపించారు.

"గ్రాండ్ టాలెంట్ షోకి స్వాగతం.. ఇండియాలో నంబర్ 1 ఆంటీ కోసం వేట. ఇది ఆంటీలకు మాత్రమే టాలెం...