Hyderabad, జూలై 31 -- అరిజిత్ సింగ్.. ఈ పేరు వింటే యువత ఉర్రూతలూగిపోతుంది. దశాబ్ద కాలానికిపైగా ఇండియాను ఈ వాయిస్ ఊపేస్తోంది. మంత్రముగ్ధులను చేసే గాత్రంతో, ఎన్నో హృదయాలను తాకిన పాటలకు ప్రాణం పోసిన గాయకుడు ఈ అరిజిత్ సింగ్. అతని కాన్సర్ట్‌లు ప్రేక్షకులతో కిక్కిరిసిపోతూ ఉంటాయి.

మరి ఒక ప్రదర్శనకు అతడు ఎంత వసూలు చేస్తాడో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ మధ్య 'లల్లన్‌టాప్'తో మాట్లాడిన సంగీత దర్శకుడు మోంటీ శర్మ.. అరిజిత్ సింగ్ తీసుకునే భారీ పారితోషికం గురించి వెల్లడించాడు.

మ్యూజిక్ ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా మారాయో గుర్తు చేసుకుంటూ మోంటీ శర్మ ఇలా చెప్పాడు. "కొన్నేళ్లలో అన్నీ మారిపోయాయి. గతంలో మేము ఒక పాట మొత్తం రూ.2 లక్షలకు చేసేవాళ్లం. ఇందులో ఒక పూర్తి ఆర్కెస్ట్రా, 40 వయొలిన్‌లు ఇంకా చాలా ఉంటాయి. తర్వాత నేను చేసిన మ్యూజిక్ బాగా పేరు తెచ్చాక, నేను ఒక పా...