Hyderabad, సెప్టెంబర్ 30 -- ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ హీరోలదే ఆధిపత్యం. రెమ్యునరేషన్లు, స్టార్ స్టేటస్ విషయంలో వాళ్లే ముందుంటారు. కానీ గత పదేళ్లలో ఓ హీరోయిన్ పెద్ద పెద్ద హీరోలను వెనక్కి నెట్టేసింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో కొంతమంది హీరోయిన్లు పెద్ద సూపర్‌స్టార్లను కూడా దాటిపోతున్నారు. తాజాగా ఐఎండీబీ కొత్త రిపోర్ట్ కూడా ఇదే చెబుతోంది. ఈ రిపోర్ట్ లోని ఒక విషయం ఏంటంటే గత పదేళ్లలో ప్రేక్షకులు అత్యధికంగా సెర్చ్ చేసిన ఇండియన్ యాక్టర్ల లిస్ట్‌ను ఒక హీరోయిన్ లీడ్ చేస్తోంది. ఆ లిస్ట్‌లో ఖాన్ లు గానీ, రజినీకాంత్, ప్రభాస్ లాంటి సౌత్ సూపర్‌స్టార్లు గానీ లేరు.

ఐఎండీబీ మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్ ఆఫ్ ది లాస్ట్ డెకేడ్ లిస్ట్ జనవరి 2014 నుంచి ఏప్రిల్ 2024 వరకు ఉన్న ఐఎండీబీ వీక్లీ ర్యాంకింగ్స్ ఆధారంగా తయారైంది. ప్రపంచవ్యాప్తంగా ఐఎండీబీ ని సంద...