భారతదేశం, జనవరి 7 -- ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ మ్యాచ్‌ల వేదికల విషయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మధ్య వివాదం రాజుకుంది. భద్రతా కారణాల రీత్యా తాము భారత్‌లో ఆడలేమని బంగ్లాదేశ్ అంటుండగా.. "భారత్‌లో ఆడకపోతే పాయింట్లు కోల్పోవాల్సిందే" అని ఐసీసీ అల్టిమేటం జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే బీసీబీ ఈ వార్తలను ఖండించింది.

భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026కి ముందు పొలిటికల్ హీట్ పెరిగింది. ఐపీఎల్ వివాదం, భద్రతా కారణాల పేరుతో బంగ్లాదేశ్ బోర్డు చేస్తున్న హడావిడి, ఐసీసీ రియాక్షన్ వివరాలు ఇక్కడ చూడండి.

తమ మ్యాచ్‌లను భారత్ నుంచి వేరే దేశానికి మార్చాలని బీసీబీ కోరింది. దీనిపై ఐసీసీ సీరియస్‌గా స్పందిస్తూ.. "షెడ్యూల్ ప్రకారం భారత్‌లోనే ఆడాలి, లేదంటే ఆ మ్యాచ్‌ల పాయింట్లు వదులుకోవాల్సి ఉంట...