భారతదేశం, జనవరి 24 -- అర్థం లేని వాదనతో మొండి పట్టు పట్టిన బంగ్లాదేశ్ కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఆ టీమ్ ను టీ20 ప్రపంచకప్ టోర్నీ నుంచి తొలగిస్తూ ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. 2026 టీ20 ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ ఆడుతుందని ఐసీసీ తేల్చేసింది.

టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) శనివారం (జనవరి 24) తొలగించింది. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ కు వెళ్లడానికి బంగ్లాదేశ్ జట్టు నిరాకరించడమే దీనికి కారణం. బుధవారం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) కు తుది నిర్ణయం తీసుకోవడానికి ఐసీసీ 24 గంటల సమయం ఇచ్చింది. కానీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం, క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ భారత్ కు ప్రయాణించడం సాధ్యం కాదన్నారు.

గురువారం బంగ్లాదేశ్ చివరి ప్రయత్నం చేసి...