భారతదేశం, జనవరి 30 -- మెగాస్టార్ చిరంజీవి లెటేస్ట్ బ్లాక్ బస్టర్ 'మన శంకర వరప్రసాద్ గారు' బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. కలెక్షన్ల మోత మోగిస్తోంది ఈ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్. ఈ సూపర్ హిట్ మూవీ ఇండియాలోనే రూ.200 కోట్లకు పైగా నెట్ వసూళ్లు ఖాతాలో వేసుకుంది. మరోవైపు మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి చిరంజీవి పాడిన పెద్దిరెడ్డి వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

సంక్రాంతి 2026 విన్నర్ అయిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూ, కలెక్షన్లలో దూకుడు కొనసాగిస్తోంది. జనవరి 12, 2026న రిలీజైన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం ట్రేడ్ అనలిస్ట్ సక్నిల్క్ ప్రకారం ఇండియాలోనే రూ.200.69 కోట్ల నెట్ కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది.

మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రపంచవ్యాప్తంగానూ అదరగొడుతోంది. ఈ ...