భారతదేశం, జూలై 16 -- అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో మూడు టెస్టులు ముగిసే సరికి 2-1తో లీడ్ లో ఉన్న ఇంగ్లాండ్ కు ఐసీసీ దిమ్మతిరిగే షాకిచ్చింది. థ్రిల్లింగ్ గా సాగిన మూడో టెస్టులో ఇండియాపై ఇంగ్లాండ్ 22 పరుగుల తేడాతో గెలిచింది. లార్డ్స్ లో ముగిసిన ఈ టెస్టులో ఆటగాళ్ల మధ్య వాగ్వాదం, కోపం, నిరాశ, బాధ.. ఇలా ఎన్నో ఎమోషన్స్ కనిపించాయి. చివరకు ఇంగ్లిష్ టీమ్ గెలిచింది. కానీ ఆ టీమ్ కు ఐసీసీ ఫైన్ విధించింది.

లార్ట్స్ లో ఇండియాతో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ స్లో ఓవర్ రేట్ కొనసాగించింది. నిర్ణీత సమయంలోపు కోటా ఓవర్లు పూర్తి చేయలేకపోయింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లాండ్ పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కఠిన చర్యలు తీసుకుంది. బెన్ స్టోక్స్ సారథ్యంలోని జట్టుకు మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానాతో పాటు రెండు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్లు కో...