భారతదేశం, జనవరి 11 -- భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. 2026లో టీమిండియా తన తొలి సిరీస్ ను ఆదివారం (జనవరి 11) ప్రారంభించనుంది. వడోదరలోని కోటంబి స్టేడియం వేదికగా జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో.. యువ సంచలనం శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని టీమిండియా, మైఖేల్ బ్రేస్‌వెల్ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టుతో అమీతుమీ తేల్చుకోనుంది.

గత సిరీస్‌లో సౌతాఫ్రికాపై చెలరేగి ఆడిన సీనియర్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపైనే అందరి దృష్టి ఉంది. కేవలం ఇంటర్నేషనల్ మ్యాచ్‌లే కాకుండా.. ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలోనూ వీరిద్దరూ బౌలర్లను ఉతికారేశారు. పరుగుల వరద పారిస్తున్న ఈ ఇద్దరూ వడోదరలోనూ అదే జోరు కొనసాగిస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్ పడుతూ గాయపడిన వైస్ కెప్టెన్ శ్రేయస్...