భారతదేశం, డిసెంబర్ 19 -- రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్' సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇది సాధారణ సినిమా కాదని, భారతీయ సినిమా గమనాన్నే మార్చేసే అద్భుతమని వర్ణిస్తూ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన రివ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ధురంధర్ సినిమాపై ఇప్పటికే చాలా మంది సెల్రబిటీలు ప్రశంసలు కురిపించారు. అయితే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాత్రం శుక్రవారం (డిసెంబర్ 19) ఉదయం తన ఎక్స్‌లో ఓ సుదీర్ఘ రివ్యూ ఇస్తూ.. మూవీని ఆకాశానికెత్తాడు. ఇది ఇండియన్ సినిమాకు ఓ టర్నింగ్ పాయింట్ అని అతడు అనడం విశేషం.

"నార్త్ అయినా, సౌత్ అయినా సరే.. ఆదిత్య ధర్ ఒంటిచేత్తో భారతీయ సినిమా భవిష్యత్తును మార్చేశారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే 'ధురంధర్' అనేది జస్ట్ ఒక సినిమా కాదు.. అది సినిమా ప్రమాణాలను పెంచిన ఒక భారీ ముందడుగు. ఈ సిన...