Hyderabad, జూన్ 12 -- షారుఖ్ ఖాన్ నటించిన 'స్వదేశ్' చిత్రంపై తాను చేసిన వ్యాఖ్యలతో ఆమిర్ ఖాన్ చిక్కుల్లో పడ్డాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో.. ఆమిర్ ఖాన్ అశుతోష్ గోవారికర్ చిత్రాన్ని "చాలా బోరింగ్" అని భావించినందున తాను తిరస్కరించినట్లు చెప్పాడు. ఆమిర్ వ్యాఖ్యను ఇంటర్నెట్ తేలికగా తీసుకోలేదు. 'స్వదేశ్' భారతీయ సినిమా చరిత్రలో ఒక కళాఖండం అని చాలా మంది నెటిజన్లు వాదిస్తున్నారు. కొందరు అయితే.. ఆమిర్ ఖాన్ రాబోయే మూవీ 'సితారే జమీన్ పర్' విఫలమైతే సంతోషిస్తామని కూడా వ్యాఖ్యానించడం విశేషం.

జూమ్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ మాట్లాడాడు. ఈ సందర్భంగా స్వదేశ్ మూవీ గురించి స్పందించాడు. "నాకు అది చాలా బోరింగ్‌గా అనిపించింది. అశు నాకు మొత్తం కథను చెప్పినప్పుడు నేను అతనికి ఇదే చెప్పాను. నిజానికి, లగాన్ చేస్తున్నప్పుడు అశు నాకు ఈ కథను వివరించాడు. అప్పుడు ద...