భారతదేశం, జూలై 6 -- ఇండియన్ నేవీలో ఉద్యోగం కోరుకునేవారికి గుడ్‌న్యూస్. ఇండియన్ నేవీలో గ్రూప్ బీ, సీ పోస్టుల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్(INCET 2025) కోసం దరఖాస్తు ప్రక్రియ 2025 జూలై 5 నుండి మెుదలైంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 18 జూలై 2025గా నిర్ణయించారు. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.gov.in సందర్శించాల్సి ఉంటుంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 1110 మంది అభ్యర్థులను నియమిస్తారు.

ప్రతి పోస్టుకు 10వ తరగతి, 12వ తరగతి, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. పోస్టును బట్టి క్వాలిఫికేషన్ వేరుగా ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్లో రిక్రూట్మెంట్‌కు అర్హత, విద్యార్హతలను చూసుకోవాలి. కనీస వయస్సు 18 ...