భారతదేశం, ఆగస్టు 6 -- దేశం 79వ స్వాతంత్య్ర దినోత్సవ పండగ జరుపుకుంటున్న నేపథ్యంలో ఒకవేళ మీకు ఈ వేడుకలో ప్రసంగించే అవకాశం దక్కితే మీ ప్రసంగం ఎలా ఉండాలి? ముందుగా సభికులను కనెక్ట్ చేసుకోవాలి. స్వాతంత్య్ర దినోత్సవ విశిష్టత గుర్తు చేయాలి. దాని స్ఫూర్తిని సభికుల్లో నింపాలి. స్వతంత్ర భారతావని సాధించిన విజయాలను గుర్తు చేసుకోవాలి. భారత పౌరులుగా మన ఆకాంక్షలు, ఆశయాలు, కర్తవ్యాన్ని గుర్తు చేయండి. మాట్లాడేటప్పుడు సభ మొత్తం మీ చూపు ప్రసరించేలా చూడండి. తడబడకండి. త ఒక నమూనా ప్రసంగం ఇక్కడ చూడండి.

''పూజ్యులైన పెద్దలకు, నా ప్రియమైన సోదర సోదరీమణులందరికీ నమస్కారం.

ఈ రోజు మనమంతా ఇక్కడ మన దేశానికి అత్యంత ముఖ్యమైన, చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేసుకునేందుకు కలుసుకున్నాం. సరిగ్గా ఆగస్టు 15న మన భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం పొందింది. ఆ రోజును పురస్కరించు...