Hyderabad, ఆగస్టు 14 -- నటుడు ఆమిర్ ఖాన్ తన అభిమానులకు ఇండిపెండెన్స్ డే బహుమతిని ప్రకటించాడు. తన లేటెస్ట్ మూవీ 'సితారే జమీన్ పర్'ను తక్కువ ధరకే చూసే అవకాశాన్ని కల్పిస్తున్నాడు. ఈ సినిమా యూట్యూబ్ రెంట్ ధరను రూ.100 నుంచి కేవలం రూ.50కి తగ్గించారు. ఈ లాంగ్ వీకెండ్ సందర్భంగా మూడు రోజులు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

చాలా మంది చిత్ర నిర్మాతల మాదిరిగా కాకుండా ఆమిర్ ఖాన్ తన 'సితారే జమీన్ పర్'ను సాంప్రదాయ ఓటీటీ రూట్ లో విడుదల చేయలేదు. దీనికి బదులుగా యూట్యూబ్ ద్వారా పే-పర్-వ్యూ మోడల్‌ను ఎంచుకున్నాడు. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో కాకుండా ఎక్కువ మంది ప్రేక్షకులు సినిమాను థియేటర్లలో చూడాలని అతడు కోరాడు. ఈ నిర్ణయంపై అభిమానుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ సినీ డిస్ట్రిబ్యూటర్లు దీనిని ప్రశంసించారు.

థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత 'సితారే జ...