భారతదేశం, డిసెంబర్ 9 -- దేశ విమానయాన రంగంలో పెను సంక్షోభానికి కారణమైన ఇండిగోపై చర్యలు తీసుకుంటామని భారత ప్రభుత్వం చెప్పిన కొన్ని రోజులకే, ఆ సంస్థ కార్యకలాపాలపై డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇండిగో విమానాల సంఖ్యను 5శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.

డీజీసీఏ ఉత్తర్వులలోని కీలక అంశాలు ఇలా ఉన్నాయి:

"డీజీసీఏ జారీ చేసిన వింటర్ షెడ్యూల్ (డబ్ల్యూఎస్​) 2025 ప్రకారం, ఇండిగోకు వారానికి 15,014 డిపార్చర్‌లకు (విమానాలు బయలుదేరడం) అమోదం ఉంది. నవంబర్ 2025 నెలలో మొత్తం 64,346 విమానాలు నడపడానికి అనుమతి లభించింది. అయితే, ఇండిగో సమర్పించిన కార్యాచరణ డేటా ప్రకారం, నవంబర్ 2025లో 59,438 విమానాలు మాత్రమే నడిపింది. ఈ నెలలో 951 విమానాలు రద్దు అయినట్లు రికార్డు అయింది," అని నోటీసులో పేర్కొన్నారు.

"సమ్మర్ షెడ్యూల...