భారతదేశం, డిసెంబర్ 4 -- బుధవారం కనీసం 150 విమానాలను ఇండిగో (IndiGo) రద్దు చేయగా, ఆ గందరగోళం గురువారం కూడా కొనసాగింది. ప్రయాణీకులు విమానాల ఆలస్యం, ప్రయాణ ప్రణాళికల్లో అంతరాయాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో... కొత్త కఠినమైన సిబ్బంది రోస్టరింగ్ నిబంధనల (Crew Rostering Rules) కారణంగా ఏర్పడిన సిబ్బంది కొరతతో గణనీయమైన ఆపరేషనల్ అంతరాయాలతో సతమతమవుతోంది.

గురువారం ఉదయం ఇండిగో విమానాలలో బుక్ చేసుకున్న ప్రయాణీకులు సుదీర్ఘ ఆలస్యాలను ఎదుర్కొన్నారు. దీంతో చాలామంది సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.

నలంద క్యాపిటల్‌లో ఇన్వెస్టర్‌ అయిన ఆనంద్ శ్రీధరన్ తనకు ఎదురైన విచిత్ర అనుభవాన్ని పంచుకున్నారు. ఈరోజు ఉదయం 7 గంటలకు తన ఇండిగో విమానం బయల్దేరాల్సి ఉండగా, కెప్టెన్ మిస్సవడంతో అది నిరవధికంగా ఆలస్యం అయిందని...