భారతదేశం, మే 13 -- కోల్కతా నుంచి ముంబైకి వెళ్తున్న ఇండిగో విమానాన్ని మంగళవారం మధ్యాహ్నం కోల్ కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఐసోలేషన్ బేకు మళ్లించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడంతో విమానం బయల్దేరడంలో జాప్యం జరిగింది.

ఇంఫాల్ నుంచి ముంబైకి కోల్ కతాలో స్టాప్ ఓవర్ తో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు స్టెప్ లాడర్ పాయింట్ చెక్ గా పిలిచే సెకండరీ లెవల్ సెక్యూరిటీ ప్రొసీజర్ సమయంలో ఇండిగో సెక్యూరిటీ ఆఫీసర్ ముందు 'బాంబు' అనే పదాన్ని ఉచ్చరించడంతో ముందు జాగ్రత్త చర్యగా విమానంలో విస్తృత తనిఖీలు చేశారు. విమానం దగ్గర, విమానం ఎక్కేముందు ప్రయాణికులను, హ్యండ్ లగేజ్ ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. దీన్నే సెకండరీ లెవెల్ సెక్యూరిటీ చెక్ అంటారు. ఈ సమయంలో ఇంఫాల్ కు చెందిన ఆ ప్రయాణికుడు బాంబు అన్న...