భారతదేశం, ఆగస్టు 3 -- దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు ప్రారంభమై 19 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా సంస్థ 'హ్యాపీ ఇండిగో డే సేల్'ను ప్రారంభించింది. ఈ ఆఫర్లో భాగంగా ఛార్జీలు కేవలం రూ .1,219 నుండి ప్రారంభమవుతాయి. లిమిటెడ్ టైమ్ కింద దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో విమాన ఛార్జీలు, అనుబంధ సేవలను డిస్కౌంట్ చేశారు.

ఇండిగో తన 19వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తన నెట్‌వర్క్ అంతటా డిస్కౌంట్ ఛార్జీలతో ప్రత్యేక సేల్ ప్రారంభించింది. అయితే వన్ వే ప్రయాణానికి మాత్రమే బుక్ చేసుకోవచ్చు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. డొమెస్టిక్ ఫ్లైట్స్ ఎంపిక చేసిన సెక్టార్లలో రూ.1,219 నుంచి ఛార్జీలు మెుదలవుతాయి. అలాగే అంతర్జాతీయ విమానాలు రూ.4,319, ఇండిగో స్ట్రెచ్ సీట్లకు ఛార్జీలు చూసుకుంటే.. ఈ అదనపు లెగ్ రూమ్ సీట్లకు ఛార్జీలు రూ.9,919 నుంచి ...