భారతదేశం, డిసెంబర్ 6 -- సీనియర్ నటుడు, సూపర్‌స్టార్ మహేశ్ బాబు సోదరుడు నరేష్ ఇండిగో ఎయిర్ లైన్స్ సేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను కుదిపేసిన సాంకేతిక లోపంపై తన అసంతృప్తిని, నిరాశను వ్యక్తం చేశారు. దీంతో ఇండిగో ఎయిర్ లైన్స్ బాధితుల్లో నరేష్ కూడా ఒకరని తెలిసింది.

ఇండిగో ఎయిర్ లైన్స్ సాంకేతిక లోపం కారణంగా అనేక విమానాలు రద్దు కావడంతో పాటు, భారీగా ఆలస్యం అయ్యాయి. ఈ విషయంపై ఇటీవల నటుడు నరేష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఈ రోజుల్లో విమాన ప్రయాణం ఎంత కష్టంగా మారిందో, '90ల నాటితో పోలిస్తే' ప్రస్తుత సమస్యలు ఎలా ఉన్నాయో ఆయన వివరించారు.

తాజాగా నరేష్ ఒక వీడియోను పంచుకున్నారు. అందులో మూసివేసిన బోర్డింగ్ గేట్ల వద్ద భారీగా గుమిగూడిన ప్రయాణీకులు కనిపిస్తున్నారు. మరొక ఫోటోలో ఆయన మాస్క్ ధరించి ఉన్నారు. ఈ వీడియోను ఎక్...