Hyderabad, సెప్టెంబర్ 19 -- సింగర్ జుబీన్ గార్గ్ కన్నుమూశాడు. 2006లో వచ్చిన 'యా అలీ' పాటతో బాగా పాపులర్ అయిన అతడు.. శుక్రవారం (సెప్టెంబర్ 19) సింగపూర్‌లో స్కూబా డైవింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు మరణించాడు. అతని వయసు 52. 1990లలో అస్సాంలో పాపులర్ అయిన ఈ సింగర్.. 2006లో 'యా అలీ' పాటతో దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నాడు.

నార్త్ ఈస్ట్ న్యూస్ రిపోర్ట్ ప్రకారం సింగర్ జుబీన్ గార్గ్ సింగపూర్‌లో స్కూబా డైవింగ్ చేస్తుండగా సముద్రంలో పడిపోయాడు. ఆయనను రక్షించి ఐసీయూలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. సింగపూర్‌లో ఈరోజు జరగాల్సిన నార్త్ ఈస్ట్ ఫెస్టివల్‌లో ఆయన పర్ఫార్మ్ చేయాల్సి ఉంది.

శుక్రవారం (సెప్టెంబర్ 19) మధ్యాహ్నం అస్సాం కేబినెట్ మినిస్టర్ అశోక్ సింఘాల్ సోషల్ మీడియాలో సింగర్ జుబీన్ గార్గ్ మరణాన్ని కన్ఫర్మ్ చేశారు. "మన ప్రియమైన జుబీన్ గార్...