భారతదేశం, డిసెంబర్ 12 -- బాలీవుడ్ నటి రిచా చద్దా తన పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తొలిసారిగా సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ షూటింగ్‌కు వెళ్తున్న ఆమె.. ప్రెగ్నెన్సీ సమయంలో తాను పడిన శారీరక, మానసిక వేదనను, ఇండస్ట్రీలో ఎదుర్కొన్న నమ్మక ద్రోహాలను బయటపెట్టింది. తన కూతురి తొలి ఫోటోను షేర్ చేస్తూ ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

'హీరామండి' వెబ్ సిరీస్ నటి రిచా చద్దా ఇటీవల తన భర్త అలీ ఫజల్ తో కలిసి మొదటి బిడ్డకు వెల్కమ్ చెప్పిన విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఆమె మళ్లీ మేకప్ వేసుకుని షూటింగ్‌కు సిద్ధమయింది. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన కూతురితో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ, తల్లిగా మారిన తర్వాత తన ప్రయాణం ఎంత కష్టంగా సాగిందో వివరిస్తూ ఒక సుదీర్ఘమైన నోట్ రాసింది. ముఖ్యంగా ఇండస్ట...