భారతదేశం, ఆగస్టు 3 -- ఫిల్మ్ ఇండస్ట్రీలో మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలిసిపోయింది. ఇవాళ (ఆగస్టు 3) ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె స్పెషల్ వీడియో పోస్టు చేసింది. ప్రతి ఏడాది ఆగస్టులో వచ్చే ఫస్ట్ సండేను ఫ్రెండ్‌షిప్ డేగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. 'ఆడల్ట్ ఫ్రెండ్‌షిప్ బెస్ట్' అంటూ తమన్నా ఇన్ స్టాగ్రామ్ రీల్ పోస్టు చేసింది.

ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఆదివారం తమన్నా తోటి హీరోయిన్లు మృణాల్ ఠాకూర్, కాజల్ అగర్వాల్, రాషా తధానీలతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. కొత్త రీల్ లో తమన్నా నేరుగా కెమెరాతో మాట్లాడుతూ.. "అడల్ట్ ఫ్రెండ్ షిప్స్ బెస్ట్! నేను మాట్లాడే ప్రతి స్నేహితుడిలానే.. ప్రతి ఫోన్ కాల్ 'ఐ లవ్ యూ'తో ముగుస్తుంది. ప్రతి ఫోన్ కాల్ మీరు ఎలా ఫీలవుతున్నారో అనే దాని గురించే ఉంటుంది. పాఠశాల, కళాశాలలో బెస్ట...