భారతదేశం, డిసెంబర్ 18 -- నటి నివేదా థామస్ సోషల్ మీడియాలో ఫైర్ అవుతూ పోస్టు పెట్టడం కలకలం రేపింది. తన గుర్తింపును దుర్వినియోగం చేస్తూ ఏఐ సృష్టించిన చిత్రాల సర్క్యులేషన్ కు వ్యతిరేకంగా ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు పోస్టు చేసింది. ఇలా చేయడం చట్టవిరుద్ధం, గోప్యతను తీవ్రంగా ఉల్లంఘించిండమే అని పేర్కొంది.

హీరోయిన్ నివేదా థామస్ ఫొటో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఆమె చీరలో అసభ్యకరంగా ఉన్న ఫొటో ఇది. ఈ పిక్ ను చూసి నివేదా థామస్ సీరియస్ అయింది. ఆ మానిప్యులేట్ చేసిన చిత్రాన్ని తన ఎక్స్ అకౌంట్లో ఫ్లాగ్ చేసిన నివేదా.. అటువంటి కంటెంట్ తో నిమగ్నమవ్వడం లేదా షేర్ చేయడం మానుకోవాలని యూజర్లను కోరింది.

ఏఐ జనరేట్ చేస్తున్న ఫొటోలపై నివేదా థామస్ సీరియస్ అయింది. ఏఐ కంటెంట్ తీవ్రంగా కలవరపెడతున్నట్లు ఎక్స్ లో గట్టిగా చెప్పిన పోస్ట్ లో నివేదా తన సోషల్ మీడియాలో పంచుకున...