Hyderabad, ఫిబ్రవరి 3 -- పూరీ, పకోడాలు వంటివి వండినప్పుడు నూనె అధికంగా ఉపయోగిస్తారు. అవి వండాక నూనె మిగిలిపోతుంది. పూరీలు, పకోడాలు వేయించాక ఆ నూనెను వాడకూడదని అంటారు. నూనె నలుపురంగులోకి మారినా కూడా దాన్ని వాడకూడదు. అలాంటి నూనెను పారబోస్తారు ఎంతో మంది. నిజానికి ఇలా మిగిలిపోయిన నూనె మీకు కూడా బాగా ఉపయోగపడుతుందని మీకు తెలుసా? మిగిలిన నూనెను పారవేసే బదులు దాన్ని తిరిగి ఉపయోగించి ఇంట్లో నుంచి బొద్దింకలు, ఎలుకల వంటివి వదిలించుకోవచ్చు.

ఇళ్లలో సరైన పరిశుభ్రత లేకపోతే బొద్దింకలు, అనేక రకాల కీటకాలు సంచరిస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా ఎలుకలు కూడా తరచూ ఇళ్లలోనే మకాం వేస్తుంటాయి. మురికిని వ్యాప్తి చేయడంతో పాటు, అనేక రకాల వ్యాధులను కూడా వ్యాప్తి చేస్తాయి. వాటిని వదిలించుకోవడానికి మీరు ఈ మిగిలిపోయిన నూనెను ఉపయోగించవచ్చు. ఇందుకోసం స్ప్రే బాటిల్ లో మిగిలిన న...