భారతదేశం, ఏప్రిల్ 20 -- వరంగల్ టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం నమిలిగొండ గ్రామానికి చెందిన బోసు బుచ్చమ్మ.. జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, అమ్మోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలను తీసుకొచ్చి తన ఇంట్లో స్టోర్ చేసింది. పెద్ద మొత్తంలో బ్లాస్టింగ్ కు సంబంధించిన సామగ్రి నిల్వ ఉన్నట్లు వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. టాస్క్ ఫోర్స్ సీఐ కె.శ్రీధర్ తన సిబ్బందితో సోదాలు చేపట్టగా.. బోసు బుచ్చమ్మ ఇంట్లో పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి.

పోలీసులు బుచ్చమ్మ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న క్రమంలోనే హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల గ్రామానికి చెందిన ఒర్సు రమేశ్ అనే యువకుడు ఆటోలో ఆమె ఇంటికి వచ్చాడు. ...