భారతదేశం, నవంబర్ 12 -- బాలీవుడ్ లో మరో స్టార్ హీరో, నటుడు గోవింద అనారోగ్య పరిస్థితి ఆందోళన రేకెత్తిస్తోంది. గోవిందాను బుధవారం (నవంబర్ 12) ముంబైలోని క్రిటికేర్ ఆసియా మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. వార్తా సంస్థ పీటీఐ ప్రకారం.. గోవిందా ఇంట్లో స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రిలో చేర్చారు. గోవింద్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ధర్మేంద్రను కలిశాక

బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. హాస్పిటల్లో ఆయన్ని పరామర్శించేందుకు గోవింద వెళ్లారు.

బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు ధర్మేంద్రను పరామర్శించిన మరుసటి రోజే గోవిందా ఆసుపత్రిలో చేరడం గమనార్హం. ఆసుపత్రి నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆయన ముఖంలో తీవ్రమైన ఆందోళన కనిపించింది.

Published by HT Digital Content Servi...