Hyderabad, జూలై 23 -- బాలీవుడ్ లో ఆశిక్ బనాయా ఆప్నేలాంటి సినిమాల్లో బోల్డ్ గా నటించిన నటి తనుశ్రీ దత్తా. అంతేకాదు ఇండియాలో #MeToo ఉద్యమానికి ఆద్యురాలిగా పేరుపొందింది. ఇప్పుడామె తన సొంత ఇంట్లోనే వేధింపులకు గురవుతున్నానని కన్నీరుమున్నీరవుతూ ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ విషయాన్ని తాను పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా ఆమె వెల్లడించింది. ఈ సంఘటన సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.

బాలీవుడ్ నటి తనుశ్రీ మంగళవారం (జులై 22) తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పంచుకుంది. అందులో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించింది. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. "నన్ను నా ఇంట్లోనే వేధిస్తున్నారు. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేశాను. వారు సరైన ఫిర్యాదు ఇవ్వడానికి పోలీస్ స్టేషన్‌కు రమ్మన్నారు. బహుశా రేపు లేదా ఎల్లుండి వెళ్తాను. నా ఆరోగ్యం బాగా లేదు. గత ఐదేళ్ల...