భారతదేశం, ఏప్రిల్ 30 -- నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. కోవూరు మండలం పొతిరెడ్డిపాలెం వద్ద కారు అదుపు తప్పి రోడ్డుపక్కనున్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ ఇంట్లో నివసిస్తున్న వెంకట రమణయ్య(50) అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వైద్య విద్యార్థుల్లో ఐదుగురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

బుచ్చిరెడ్డి పాలెంలో తమ స్నేహితుడి సోదరి నిశ్చితార్థానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ప్రమాదస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి చెందారు. మృతులను అభిషేక్‌ రాజ్‌ (అనంతపురం), నరేష్‌ నాయక్‌ (అనంతపురం)...