భారతదేశం, ఏప్రిల్ 23 -- ఇంటెల్ కార్ప్ ఈ వారంలో 20 శాతానికి పైగా సిబ్బందిని తగ్గించే ప్రణాళికలను ప్రకటించడానికి సిద్ధంగా ఉంది. అనవసర ఖర్చులను తగ్గించే లక్ష్యంతో, నిర్వహణను క్రమబద్ధీకరించడానికి, ఇంజనీరింగ్ ఆధారిత సంస్కృతిని పునర్నిర్మించే ప్రయత్నంలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ లే ఆఫ్ ప్రణాళికల గురించి ఇంటెల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

గత నెలలో బాధ్యతలు స్వీకరించిన కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లిప్-బు టాన్ ఆధ్వర్యంలో ఈ లేఆఫ్ ప్రణాళిక మొదటి అతి పెద్ద పునర్నిర్మాణం. అనుభవజ్ఞుడైన టాన్, తన మిషన్ కు ఉపయోగపడని ఇంటెల్ ఆస్తులను తొలగించి మరింత ఆకర్షణీయమైన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఇంటెల్ గత ఏడాది సుమారు 15,000 ఉద్యోగాలను తొలగించింది. 2024 చివరి నాటికి ఇంటెల్ 108,900 మంది ఉద్యోగులను కలిగి ఉం...