భారతదేశం, జనవరి 22 -- గ్లామర్, క్రేజ్, సోషల్ మీడియా వ్యూస్.. నేటి యువత ప్రపంచమంతా దీని చుట్టూనే తిరుగుతోంది. కానీ, అదే క్రేజ్ ప్రాణాల మీదకు వస్తే? ఇదే పాయింట్‌తో రూపొందిన 'తు యా మై' సినిమా ట్రైలర్ గురువారం (జనవరి 22) విడుదలైంది. ప్రముఖ దర్శకుడు బిజోయ్ నంబియార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ షనాయా కపూర్, టాలెంటెడ్ యాక్టర్ ఆదర్శ్ గౌరవ్ జంటగా నటించారు.

తు యా మై ట్రైలర్ ప్రారంభం ఓల్డ్ మూవీ 'ఖూన్ భరీ మాంగ్'ను గుర్తు చేసేలా ఆసక్తికరంగా మొదలవుతుంది. ఇందులో షనాయా కపూర్ 'మిస్ వానిటీ' అనే గ్లామరస్ కంటెంట్ క్రియేటర్‌గా కనిపిస్తుండగా, ఆదర్శ్ గౌరవ్ నాలాసోపారాకు చెందిన 'ఏ' అనే మాస్ క్రియేటర్‌గా నటించారు.

వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చిన వీరిద్దరూ వ్యూస్ కోసం, క్రేజ్ కోసం కలిసి వీడియోలు (కొల్లాబరేషన్స్) చేయడం ప్రారంభిస్తారు. వారి మధ్య కెమ...