భారతదేశం, నవంబర్ 27 -- గత కొంతకాలంగా అవినీతి అధికారుల విషయంలో తెలంగాణ ఏసీబీ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇటీవలే కాలంలో చాలా మంది అధికారులు పట్టుబడిన ఘటనలు వెలుగు చూశాయి. నిత్యం ఏదో ఒక చోట అవినీతి అధికారులు దొరికిపోతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా మున్సిపల్ కమిషనర్ రాజుతో అతని ప్రైవేట్ డ్రైవర్ అడ్డంగా దొరికిపోయారు.

ఏసీబీ అధికారులు విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పురపాలక పరిధిలో ఓ వ్యక్తి బహుళ అంతస్తు ఇంటి నిర్మాణం చేసుకున్నాడు. ఇంటి నెంబర్ కోసం అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకోసం కమిషనర్ రాజు రూ.20 వేలు డిమాండ్ చేయగా. దరఖాస్తుదారుడు ఏసీబీని ఆశ్రయించాడు.

పకడ్బందీగా రంగంలోకి దిగిన అధికారులు. ఫిర్యాదుదారుడి న...