భారతదేశం, జనవరి 28 -- ప్రజలకు మెరుగైన సేవలను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఆధునిక మౌలిక సదుపాయాలు, ప్రజా సౌకర్యాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలను నిర్మిస్తుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. కొత్త భవనాల్లో వివాహ రిజిస్ట్రేషన్ల కోసం మినీ మ్యారేజ్ హాల్స్, గర్భిణులు, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక సౌకర్యాలు, శిశువులు ఉన్న తల్లులకు భోజన గదులు, వృద్ధులు, వికలాంగులకు ఆధునిక లిఫ్ట్ సౌకర్యాలు ఉంటాయని అన్నారు.

దశాబ్ద కాలంగా గత బీఆర్ఎస్ పాలనలో తీసుకున్న స్వార్థపూరిత నిర్ణయాల కారణంగా రెవెన్యూ వ్యవస్థ క్షీణించిందని మంత్రి పొంగులేటి అన్నారు. రెండు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో ప్రభుత్వం రెవెన్యూ పరిపాలనను సంస్కరించి, ప్రజలకు సేవలను మరింత అందుబాటులోకి తీసుకువస్తోందని అన్నారు.

ఔటర్ రిం...