భారతదేశం, డిసెంబర్ 11 -- సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో అత్యంత దారుణం వెలుగు చూసింది. బీటెక్‌ విద్యార్థిపై దాడి చేసి హతమార్చిన ఘటన కలకలం రేపింది. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని పోలీసులు తేల్చారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇంజినీరింగ్ విద్యార్థి శ్రవణ్ సాయి(19) అమీన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి డిగ్రీ సెకండియర్ చదువుతోంది. వేర్వేరు చోట్ల చదువుకుంటున్నప్పటికీ వీరిద్దరి మధ్య ప్రేమ కొనసాగింది. అయితే వీరిద్దరూ టెన్త్ వరకు ఒకే చోట చదువుకున్నట్లు తెలిసింది.

వీరి ప్రేమ వ్యవహారం యువతి కుటుంబసభ్యులకు తెలిసింది. ఆ తర్వాత ఇరువురినీ పలుమార్లు హెచ్చరించినట్లు సమాచారం. అయినా వినిపించుకోకపోవడంతో మంగళవారం రోజున శ్రవణ్ సాయిని పెళ్లి చేస్తామని నమ్మించి.. మాట్లాడదాం రమ్మని యువతి కుటుంబసభ్యులు ఇం...