భారతదేశం, సెప్టెంబర్ 1 -- ఏపీలో ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత ఆధునికంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాష్ట్రంలోని 1.46 లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని నందివెలుగుల గ్రామంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో కలిసి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానని ప్రారంభించారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి అందజేశారు.

ఆంధ్రప్రదేశ్ అంతటా మొత్తం 1.46 కోట్ల మంది లబ్ధిదారులు స్మార్ట్ రేషన్ కార్డులను అందుకోనున్నారు. వీరిలో గుంటూరు జిల్లాలో 5.85 లక్షలు, తెనాలి నియోజకవర్గంలో 83,000 మంది ఉన్నారు. 'గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంల...