భారతదేశం, ఫిబ్రవరి 11 -- ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. విద్యార్థులను ఆరోగ్యంగా ఉంచే ప్రయత్నంలో భాగంగా రాబోయే విద్యా సంవత్సరం(2026-27) నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించాలని తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి తెలిపింది యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ ప్రతిపాదన ప్రస్తుతం ఆర్థిక, పరిపాలనా పరిశీలనలో ఉందని ఇంటర్ విద్యా మండలి అధికారులు తెలిపారు. తొమ్మిది, పదో తరగతుల విద్యార్థులతో సమానంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ ప్రయోజనాన్ని అందించడానికి చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రతిపాదిత పథకం తెలంగాణ అంతటా దాదాపు 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.

ఈ కార్యక్రమం అంచనా వ్యయం సంవత్సరానికి సుమారు రూ. 180 క...