భారతదేశం, అక్టోబర్ 28 -- తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రైవేట్ ఇంటర్ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. మార్చి 2026లో నిర్వహించే ఫైనల్ పరీక్షలకు హాజరు అయ్యేందుకు విద్యార్థులకు హాజరు నుంచి మినహాయింపు దొరకనుంది. అయితే ఇందుకోసం ఫీజు చెల్లించాల్సి ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది. నిజానికి ఇలాంటి అవకాశాన్ని చాలా కాలంగా ఇంటర్ బోర్డు అమలు చేస్తోంది. అయితే సైన్స్ విద్యార్థులకు ఇది వర్తించదు. ఆర్ట్స్, హ్యుమానిటీస్ కోర్సులు చదివే ప్రైవేట్ విద్యార్థులు హాజరు నుంచి మినహాయింపు ఉంటుంది.

హాజరు మినహాయింపు కోరుకునే విద్యార్థులు రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు ప్రకటనలో తెలిపింది. అయితే 17-11-2025 నాటికి ఈ ఫీజు చెల్లించాలి. ఒకవేళ మిస్ అయితే 29-11-2025 వరకు రూ.200 ఆలస్య రుసుముతో చెల్లించవచ్చు.

అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులు, ఒరిజనల్ సర్టిఫికేట్స్...