భారతదేశం, డిసెంబర్ 21 -- భారతదేశంలోని వేలాది మంది హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు అమెరికా ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది! ఈ డిసెంబర్ నెలలో జరగాల్సిన వీసా ఇంటర్వ్యూలను అకస్మాత్తుగా రద్దు చేస్తూ, వాటిని ఏకంగా కొన్ని నెలల పాటు వాయిదా వేసింది. కొత్తగా ప్రవేశపెట్టిన కఠినమైన 'బ్యాక్‌గ్రౌండ్ చెక్', 'సోషల్ మీడియా స్క్రీనింగ్' నిబంధనల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

డిసెంబర్ 15 తర్వాత అపాయింట్‌మెంట్‌లు ఉన్న వారు ఈ నిర్ణయం వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యారు. వీరిలో కొందరికి ఏకంగా అక్టోబర్ 2026 నాటి తేదీలను రీషెడ్యూల్ చేయడం గమనార్హం!

ఈ విషయంపై భారత్‌లోని అమెరికా ఎంబసీ ఇప్పటికే దరఖాస్తుదారులను హెచ్చరించింది.

"మీ వీసా అపాయింట్‌మెంట్ రీషెడ్యూల్ అయినట్లు మీకు మెయిల్ వస్తే, కొత్త తేదీన మాత్రమే రావాలి. పాత తేదీ ప్రకారం ఎంబసీ లేదా కన్సులేట్‌కు వస్తే ...