భారతదేశం, డిసెంబర్ 4 -- ఎటువంటి పరీక్ష లేకుండా బ్యాంకులో ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి మంచి ఛాన్స్ వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ (SCO) పోస్టుల కోసం కొత్త నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. 996 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ నియామకానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ డిసెంబర్ 2 నుండి బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ sbi.bank.inలో కూడా ప్రారంభమైంది.

ఈ నియామకం ద్వారా ఉద్యోగం పొందడానికి గొప్ప అవకాశం వస్తుంది. ఎంపిక ప్రక్రియలో షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ మాత్రమే ఉంటాయి. వీపీ వెల్త్(ఎస్ఆర్ఎం) 506 ఖాళీలు, ఏవీపీ వెల్త్(ఆర్ఎం) 206, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ 284 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మెుత్తం ఖాళీలులు 996. ఇందులో హైదరాబాద్ 43, అమరావతిలో 23 ఖాళీలు ఉన్నాయి.

వీపీ వెల్త్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థు...