భారతదేశం, ఏప్రిల్ 22 -- తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అర్హతతో చాలా ప్రభుత్వ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. వాటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. ఇంటర్మీడియట్ అర్హతతో దరఖాస్తు చేసుకునే కొన్ని ఉద్యోగాలు ఇలా ఉన్నాయి.

1.గ్రూప్-IV ఉద్యోగాలు.. జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ వంటి పోస్టులు ఉంటాయి.

2.వివిధ శాఖలలో అసిస్టెంట్ పోస్టులు.. నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ, రవాణా శాఖ మొదలైన వాటిలో అసిస్టెంట్, ఇతర క్లరికల్ పోస్టులు.

3.పోలీస్ కానిస్టేబుల్, ఇతర పోలీస్ ఉద్యోగాలు.. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ వీటిని భర్తీ చేస్తుంది.

4.హైకోర్టు ఉద్యోగాలు.. రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్ వంటి పోస్టులు....