భారతదేశం, మే 26 -- కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో ఊర్వశి రౌటేలా, అలియా భట్ సెల్ఫీ వైరల్ గా మారింది. ఈ ఫొటోను ఊర్వశి రౌటేలా ఆదివారం (మే 25) తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటో తెగ ట్రెండ్ అవుతోంది. ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశితో అలియా సెల్ఫీ స్పెషల్ గా నిలిచింది.

బాలీవుడ్ భామలు అలియా భట్, ఊర్వశి రౌటేలా నవ్వుతూ తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ పిక్ లో ఇద్దరూ నవ్వుతూ కనిపించారు. అలియా బ్లాక్ అండ్ వైట్ కలర్ దుస్తులు, డార్క్ సన్ గ్లాసెస్, గోల్డెన్ చెవిపోగులు ధరించింది. ఊర్వశి బ్లాక్ ఫ్లోరల్ తో కూడిన తెలుపు రంగు దుస్తుల్లో మెరిసింది. ఆ లొకేషన్ ను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ గా జియోట్యాగింగ్ చేశారు.

కేన్స్ క్రషర్స్ అంటూ ఈ సెల్పీని ఊర్వశి రౌటేలా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. "కేన్స్ క్యాప్ష...