భారతదేశం, ఆగస్టు 20 -- హైదరాబాద్: హైదరాబాద్‌లో అకస్మాత్తుగా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడటంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.

టీజీఎస్‌పీడీసీఎల్ (TGSPDCL) అధికారులు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఇంటర్నెట్ కేబుళ్లను తెంచుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ చర్య వల్ల లక్షల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని, ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులు (Work-from-home) తీవ్రంగా నష్టపోతున్నారని, రోజువారీ జీవితం గందరగోళంలో పడిందని ఆయన ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు.

కేటీఆర్ తన పోస్ట్‌లో, "ఏరికోరి జోకర్‌ను ఎన్నుకుంటే, సర్కస్ చూడాల్సిందే.. టీజీఎస్‌పీడీసీఎల్ ...