భారతదేశం, సెప్టెంబర్ 15 -- సెప్టెంబర్ 15 భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి. హైదరాబాద్‌ను వరదల నుండి కాపాడిన వాస్తుశిల్పిగా ఆయన చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇప్పటికీ ఆయన ముందుచూపుతోనే భాగ్యనగరం మునిగిపోకుండా ఉందని చెప్పవచ్చు. 1908లో హైదరాబాద్‌లో వినాశకరమైన వరదలు సంభవించాయి. ఆ సమయంలో మూసీ నది ఉప్పొంగి ప్రవహించి వేలాది ఇళ్లు మునిగిపోయాయి. దాదాపు 15,000 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇలాంటి అతిపెద్ద విపత్తు హైదరాబాద్‌ను అతలాకుతలం చేసింది. మళ్లీ అలాంటి వరదలు రాకుండా అప్పటి నిజాం నవాబు.. మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆహ్వానించారు. హైదరాబాద్ నగరం అంతా తిరిగి చూసిన విశ్వేశ్వరయ్య.. మూసీ, ఈసీ నదులపై రెండు భారీ జలాశయాలను నిర్మించాలని ప్రతిపాదించాడు. దీని ఫలితంగా ఉస్మాన్ సాగర్ (1920లో పూర్తయింది), హిమాయత్ సాగర్ (1927లో పూర్తయింది) కం...