భారతదేశం, సెప్టెంబర్ 9 -- ఈఏపీసెట్ మూడో విడత(చివరి) కౌన్సెలింగ్ కోసం షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఇంజినీరింగ్ 2025 మూడో దశ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. కౌన్సెలింగ్ రౌండ్‌లో పాల్గొనాలనుకునే అభ్యర్థులు eapcet-sche.aptonline.in వద్ద అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

కౌన్సెలింగ్ కోసం నమోదు చేసుకోవడానికి అభ్యర్థులు తమ AP EAPCET హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 11, 2025 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నమోదు చేసుకున్న తర్వాత నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్లలో అప్‌లోడ్ చేసిన సర్టిఫికేట్ల పరిశీలన 12, 2025 వరకు ఉంటుంది. సెప్టెంబర్ 9 నుండి 12 2025 వరకు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. అయితే సెప్టెంబర్ 13, 2025న వెబ్ ఆప్షన్స్ మార్చవచ్చు.

సీట్ల కేటాయింపు ఫలితాలు సెప్టెంబర్ 15, 2025న విడుదల కానున్నాయి...