Telangana,hyderabad, జూలై 24 -- బీటెక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ ప్రవేశాల ప్రక్రియ ముగియగా. రేపట్నుంచి (జూలై 25) సెకండ్ ఫేజ్ ప్రవేశాల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. జూలై 30లోపు సీట్ల కేటాయింపు ఉంటుంది.

టీజీ ఈఏపీసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ జూలై 25 నుంచి ప్రారంభమవుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జూలై 26వ తేదీన పూర్తి చేస్తారు. జూలై 26వ తేదీ నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి. జూలై 27వ తేదీన వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ కు అవకాశం కల్పిస్తారు. జూలై 30లోపు సీట్ల కేటాయింపు ఉంటుంది.

రెండో విడతలో సీట్లు పొందే అభ్యర్థులు జూలై 30 నుంచి ట్యూషన్ ఫీజు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు. ఈ గడువు ఆగస్టు 1వ తేదీతో పూర్తవుతుంది. ...